Nindha Movie Review: నింద మూవీ రివ్యూ.. వరుణ్ సందేశ్ హిట్టు కొట్టాడా?

Nindha Movie Review: నింద మూవీ రివ్యూ.. వరుణ్ సందేశ్ హిట్టు కొట్టాడా?

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు వరుణ్ సందేశ్(Varun Sandesh) చాలా గ్యాప్ తరువాత హీరోగా చేసిన సినిమా నింద(Nindha). మర్డర్ మిస్టరీ కథాంశంతో వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు రాజేష్ జగన్నాధం తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ తో ఆడియన్స్ లో మంచి ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇక వరుణ్ సందేశ్ కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇందుకోసం మునుపెన్నడూ లేనివిదంగా ప్రమోషన్స్ కూడా చేశాడు. ఇక ఈ సినిమా నేడు (జూన్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో అయినా వరుణ్ సందేశ్ హిట్టు కొట్టాడా? సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

కథ:
కాండ్రకోట అనే ఊరు. ఆ ఊరిలో ఒకరోజు ముంజు అనే అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోతుంది. ఆమెను బాలరాజు (ఛత్రపతి శేఖర్) అనే వ్యక్తి అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. కోర్టు అతనికి ఉరిశిక్ష విదిస్తుంది. కానీ, ఆ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ (తనికెళ్ల భరణి) మాత్రం సరైన తీర్పు ఇవ్వలేదనే బాధతో చనిపోతాడు. దాంతో.. ఆ కేసులో అసలు నిందితులను పట్టుకునేందుకు జడ్జి కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) రంగంలోకి దిగుతాడు. మరి వివేక్ అసలు నిందితులను పెట్టుకున్నాడా? ఆ ప్రయాణంలో అతను తెలుసుకున్న నిజాలు ఏంటి? బాలరాజుకు ఉరి శిక్ష తప్పిందా? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:
చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తిని బయటకు తీసుకుకురావడానికి హీరో చేసే ప్రయత్నం, చివరకు అసలు దోషులకు శిక్ష పడటం. ఇలాంటి కథలతో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన నింద కథ కూడా అలాంటిదే. 

ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి ఆరుగురు వ్యక్తులను కిడ్నాప్ చేయడంతో నింద సినిమా మొదలవుతుంది. ఆ తరువాత వారి నుండి నిజం రాబట్టాలని ఆ వ్యక్తి చేసే ఇన్వెస్టిగేషన్ తో సినిమా ముందుకు సాగుతుంది. ఈసన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తుంది. వాటిని ఇంకాస్త బాగా డీల్ చేసుంటే బాగుండేది. కానీ, ఇంటర్వల్ కి వచ్చేసరికి కథలో వేగం పెరుగుతుంది. జైల్లో బాలరాజు, వివేక్ కలిసే సీన్‌తో ఇంటర్వెల్ సెట్ చేయడంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. 

అలాగే.. సెకండ్ హాఫ్ లో కథ కూడా పరుగులుపెడుతుంది. మంజు, బాలరాజు, వారి కథలతో కథ ముందుకు సాగుతుంది. అయితే ఈ సీన్స్ బాగానే ఉన్నప్పటికీ ఆడియన్స్ ను ఎగ్జైట్ చేయడం కష్టమే. కానీ, బోర్ ఫీలింగ్ రాదు. కానీ, ముందు ఎం జరుగుతుంది? అసలు నేరస్థుడు ఎవరు అనే విషయాలు ముందే తెలిసిపోతాయి. కానీ, ఆడియన్స్ ఊహించిన విదంగా కాకుండా క్లామాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి ఎండ్ చేశారు దర్శకుడు. 

నటీనటులు, సాంకేతిక నిపుణులు:
ఇంతకాలం లవర్ బాయ్ పాత్రల్లో అలరించిన వరుణ్ సందేశ్ మొదటిసారి సీరియస్ పాత్రలు సెటిల్డ్ నటనతో ఆకట్టుకుకున్నాడు. వివేక్ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం ప్రతీ సీన్ లో కనిపిస్తుంది. బాలరాజుగా చేసిన ఛత్రపతి శేఖర్, మంజుగా మధు బాగా చేశారు. మిగతా నటీనటులు కూడా పాత్రల మేర ఆకట్టుకున్నారు.

ఇక సాంకేతికనిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం అంటే మ్యూజిక్ సంతు ఓంకార్ మ్యూజిక్ అనే చెప్పాలి. తన మ్యూజిక్ తో సినిమా స్థాయిని పెంచాడు. ఇక రమీజ్ నవీత్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమా మూడ్ కి తగ్గట్టుగా అద్భుతంగా చూపించాడు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. 

ఇక మొత్తంగా నింద మూవీ గురించి చెప్పాలంటే.. వరుణ్ సందేశ్ ఎట్టకేలకు ఒక డీసెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చూడొచ్చు.