నాగార్జున సిమెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా వరుణ్ తేజ్

నాగార్జున సిమెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా వరుణ్ తేజ్

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తన ఛరిష్మాను సొమ్ము చేసుకునే పనిలో పడ్డాడు. లేటెస్ట్ గా నాగార్జున సిమెంట్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున సిమెంట్స్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో ఎక్కువ సేల్ సిమెంట్ బ్రాండ్లలో నాగార్జున సిమెంట్ కూడా ఒకటి.