- ఆప్ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్
ముషీరాబాద్, వెలుగు: పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ చేశారు. సోమవారం లిబర్టీలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత ఇంధన ధరల భారం రైతులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.
ఈ భారాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జూన్ 3న నకిరేకల్‌లో ఎడ్లబండ్లతో నిరసన ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు రాకేశ్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
