అమర సైనికుల కుటుంబాలకు చేయూతనిస్తాం : బ్రిగేడియర్ ఎన్ఆర్.బాబు

అమర సైనికుల కుటుంబాలకు చేయూతనిస్తాం : బ్రిగేడియర్ ఎన్ఆర్.బాబు

పంజాగుట్ట, వెలుగు: సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారీ మహిళా సాధికారత సదస్సును బుధవారం సోమాజీగూడలోని సైనిక సంక్షేమ భవన్​లో వీర రత్న ఫౌండేషన్ నిర్వహించింది. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాల ఆర్థిక సాధికారత, సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ సంస్థ కృషి చేస్తోందని బ్రిగేడియర్ ఎన్ఆర్.బాబు అన్నారు. 

అమర సైనికుల కుటుంబాలకు ఆర్థిక చేయూతనిస్తామని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 30 కుటుంబాలు హాజరయ్యాయి. ఈ సదస్సు మూడు రోజులపాటు కొనసాగుతుందని ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్ కుమార్ తెలిపారు.