తెలంగాణలో ఇంటికో బండి : కోటి 54 లక్షలు దాటిన వాహనాలు

తెలంగాణలో ఇంటికో బండి : కోటి 54 లక్షలు దాటిన వాహనాలు

తెలంగాణలో వాహనాల సంఖ్య ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతోంది. గత పదేళ్లుగా రాష్ట్రంలో వాహనాల సంఖ్య  దాదాపు 10 రెట్లు పెరిగాయి. 2014 లో 70.73 లక్షల వాహనాలు ఉంటే  2023లో  కోటి 54 లక్షల వాహనాలకు చేరింది.  ప్రతి ఏడాది దాదాపు 9 శాతం వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది.  2022 -2023 ఏడాదిలోనే  రాష్ట్రంలో10 లక్షల కొత్త  వాహనాలు రోడ్డెక్కాయి. తెలంగాణ ఏర్పడే నాటికి హైదరాబాద్‌లో కేవలం 25 లక్షల వాహనాలు మాత్రమే ఉండేవి.

2022-23 ప్రకారం రాష్ట్రంలో వాహనాలు 

ట్రాన్స్ ఫోర్ట్ డిపార్ట్ మెంట్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో  కోటి 54 లక్షల 77 వేల 512  వాహనాలు ఉన్నాయి. ఇందులో టూవీలర్  1. 13 కోట్లు ఉండగా..  మోటార్ కార్స్ 20 లక్షలు, ఆటో రిక్షాలు 4.5 లక్షలు, స్కూల్ బస్సులు 28,962, గూడ్స్ రిక్షాలు 6.09 లక్షలు, ఈ కార్ట్ 235, మోటార్ క్యాబ్స్ 20,337, మాక్సీ క్యాబ్స్  31,060, కాంట్రాక్ట్ క్యారేజ్ 9,244 , ప్రైవేట్ సర్వీసులు 3,145, స్టేజ్ క్యారేజస్ 17 వేల 956, ట్రాక్టర్స్, ట్రైలర్స్ కలిసి 7 లక్షలు, ఇతర వాహనాలు 87 ,835 ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో దాదాపు 70 లక్షల వ్యక్తిగత   వాహనాలు ఉన్నాయి. వీటిలో 50 లక్షలకు పైగా టూ వీలర్ వాహనాలుండగా..  13 లక్షల ఫోర్ వీలర్ వెహికల్స్ ఉన్నాయి.

2013-2014 ప్రకారం రాష్ట్రంలో వాహనాలు

పదేళ్ల క్రితం 2013-14లో, రాష్ట్రంలో సుమారు 70 లక్షల73 వేల109 లక్షల రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నాయి. వీటిలో లక్షా 25 వేల240 ట్రక్కులు,  52 లక్షల 25 వేల 52 టూ వీలర్ వాహనాలు.. 7 లక్షల 96 వేల 232 కార్లు, 14 వేల 989 జీపులు, 74 వేల 97 ట్యాక్సీలు, 40 వేల 807 బస్సులు, లక్షా 85 వేల 688  గూడ్స్, ఓమ్నీ బస్సులు 41,978, ఇతర వాహనాలు లక్షా 48 వేల 361 ఉన్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాహనాల రిజిస్ట్రేషన్లు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో  46,937 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి.