V6 News

ఇంటర్ విద్యార్థులకు వెలుగు ‘సక్సెస్​’

ఇంటర్ విద్యార్థులకు వెలుగు ‘సక్సెస్​’

వెలుగు నెట్​వర్క్​: రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీల్లోని స్టూడెంట్స్​కు వెలుగు పేపర్ లో వచ్చే ‘సక్సెస్​’ కాపీలను శనివారం అందజేశారు. ఏటూరునాగరం మంగపేట ప్రభుత్వ జూనియర్​కాలేజీలో వెలుగు ‘సక్సెస్’​ మెటీరియల్​ను మండల కేంద్రానికి చెందిన హబీబ్​ మెడికల్​ షాపు యజమాని, ప్రముఖ అభ్యుదయవాది ఎండీ గఫార్​ఖాన్ ​సహకారంతో అందజేశారు. స్టుడెంట్స్ కు ఈ మెటీరియల్ ఎంతో ఉపయోగపడుతుందని పలువురు కాలేజీల ప్రిన్సిపాల్స్, విద్యాశాఖ అధికారులు, నాయకులు అన్నారు.

నర్సంపేట లయన్స్​క్లబ్​ ఆధ్వర్యంలో..  గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీ, కేఎస్ఆర్​కాలేజీల్లో ఇంటర్​స్టూడెంట్స్​కు నాలుగు వందల వెలుగు ‘సక్సెస్’​ పేపర్లను పంపిణీ చేశారు.

మెదక్​లో వాసవి క్లబ్‌‌ రీజియన్‌‌ ఛైర్మన్‌‌ గంజి శ్రీనివాస్‌‌ సౌజన్యంతో ప్రభుత్వ బాలికల జూనియర్‌‌ కళాశాల, బాలుర జూనియర్‌‌ కళాశాలలో 200 మంది స్టూడెంట్స్‌‌కు ‘సక్సెస్’ కాపీలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన ఇంటర్మీడియట్‌‌ మెదక్‌‌ జిల్లా నోడల్‌‌ ఆఫీసర్‌‌ సూర్యప్రకాశ్‌‌ మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఇంటర్మీడియట్‌‌ స్టూడెంట్స్‌‌కు ఉపయోగపడేలా ‘సక్సెస్‌‌’ ఎడిషన్‌‌ ఉందన్నారు.

కాటారం మండల కేంద్రంలోని గాయత్రీ ప్రైవేటు కాలేజీలో కాటారం నూతన సర్పంచ్ తోట రాజమ్మ, ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్.. వెలుగు పత్రికను స్టూడెంట్స్​కు అందజేశారు. మహాదేవపూర్ మండలం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మాజీ జడ్పీటీసీ చల్ల తిరుపతి రెడ్డి 350 ‘సక్సెస్’​ కాపీలను స్టూడెంట్స్​కు అందించారు. మలహర్ రావు మండలం తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివేక్ యువసేన నాయకులు దేవి భూమయ్య ఆధ్వర్యంలో స్టూడెంట్స్​కు వెలుగు ‘సక్సెస్’ మెటీరియల్​ అందజేశారు.

నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్​ కాలేజీలో ఎంపీ గుత్తా సుఖేందర్​ రెడ్డి జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్​ సీనియర్​ నాయకులు, తిప్పర్తి ఎంపీపీ పాశం రాంరెడ్డి ‘సక్సెస్​’ స్టడీ మెటీరియల్ స్టూడెంట్స్​కు పంపిణీ చేశారు. ములుగులో మహర్షి విద్యాసంస్థల కరస్పాండెంట్​ పిచ్చిరెడ్డి స్టూడెంట్స్​కు ‘సక్సెస్’​ మెటీరియల్​ పంపిణీ చేశారు.

సూర్యాపేటలో స్థానిక సాయిసంతోషి జ్యువెల్లర్స్ అధినేత తెడ్ల కిషోర్ సౌజన్యంతో జూనియర్ కాలేజీ  స్టూడెంట్స్​కు ‘సక్సెస్’​ మెటీరియల్​ పంపిణీ చేశారు.