- హాజరుకానున్న సీఎం రేవంత్, పలువురు మంత్రులు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి గురువారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు. సభ ప్రారంభానికి ముందే రాజ్యసభ చైర్మన్ ఆయనతో ఎంపీగా ప్రమాణం స్వీకారం చేయించనున్నట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు.
అలాగే, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, విప్ ఆది శ్రీనివాస్, ఇతర నేతలు ఢిల్లీకి వెళ్లారు. కాగా.. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సీఎంఓ వర్గాలు వెల్లడించాయి.

