వెనుజువెలాకు భారత్ సాయం.. మరోసారి మానవత్వం చాటిన ఇండియన్ ఆర్మీ

వెనుజువెలాకు భారత్ సాయం.. మరోసారి మానవత్వం చాటిన ఇండియన్ ఆర్మీ

వెనిజువెలాలో రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోగా ఇంకా వేలాదిమంది గల్లంతయ్యారు. బాధితులకు సహాయం అందించేందుకు భారతదేశం వెంటనే స్పందించింది. భారత వైమానిక దళానికి చెందిన సి-17 విమానాల ద్వారా 41 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక రెస్క్యూ బృందం, ఫీల్డ్ హాస్పిటల్, 35 టన్నుల సహాయ సామగ్రిని వెనిజులాకు పంపింది.

ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాల సమయంలో ఇతర దేశాలకు అండగా నిలవడం భారత్‌కు కొత్త విషయం కాదు. 2015లో నేపాల్ భూకంపం సమయంలో 'ఆపరేషన్ మైత్రి', యెమెన్‌లో 'ఆపరేషన్ రాహత్', దక్షిణ సూడాన్‌లో 'ఆపరేషన్ సంకట్ మోచన్', కోవిడ్ సమయంలో 'ఆపరేషన్ సముద్ర సేతు', 2025లో మయన్మార్‌లో 'ఆపరేషన్ బ్రహ్మ', శ్రీలంకలో 'ఆపరేషన్ సాగర్ బంధు' వంటి అనేక మానవతా సహాయక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది.

ALSO READ : హాట్ అందాలతో కాక పుట్టిస్తున్న క్రిస్టియానో రొనాల్డో భార్య

తాజాగా 'ఆపరేషన్ అమిస్టాడ్' ద్వారా వెనిజులా ప్రజలకు అండగా నిలిచిన భారత్, ప్రపంచంలో మానవతా సహాయం అందించే దేశంగా మరోసారి తన బాధ్యతను చాటుకుంది.