టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి కొనసాగింపు

టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి కొనసాగింపు

హైదరాబాద్, వెలుగు: టీసాట్‌‌‌‌ (సాఫ్ట్‌‌నెట్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా వేణుగోపాల్ రెడ్డి పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనే ఈ పదవిలో కొనసాగుతారని స్పష్టం చేస్తూ విద్యాశాఖ సెక్రటరీ యోగిత రాణా జీవోనెంబర్ 96ను విడుదల చేశారు. 

వేణుగోపాల్ రెడ్డిని ప్రభుత్వం తొలిసారిగా 2024, మార్చి 5న రెండేండ్ల కాలపరిమితితో టీసాట్‌‌ సీఈవోగా నియమించింది. కాలపరిమితి పూర్తయి.. 3 నెలలు దాటిన తర్వాత  మళ్లీ కొనసాగిస్తూ ఉత్వర్వులు ఇవ్వడం గమనార్హం.