
సినీ నటుడు, రచయిత జాన్ కొట్టోలి గుండెపోటుతో చనిపోయారు. కూకట్‌పల్లి ప్రగతి నగర్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. ఫలక్‌నుమా దాస్, మను, రక్తం, యుద్ధం శరణం తదితర చిత్రాల్లో నటించిన జాన్… చివరిసారిగా ‘గాడ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. జాన్ భౌతికకాయన్ని బుధవారం ఉదయం ఆయన స్వస్థలమైన కేరళ కి తరలిస్తారు. జాన్ మృతి పట్ల పద్మ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్, సినీ నిర్మాత రాజేష్ టచ్‌రివర్ తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.