లతా మంగేష్కర్‌ కు తీవ్ర అస్వస్థత

లతా మంగేష్కర్‌ కు తీవ్ర అస్వస్థత

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.ఇవాళ తెల్లవారుజామున 2 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికి ఆమె విషమ పరిస్థితిలో ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. లతా మంగేష్కర్ అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.