22 భాషాల్లో వ్యాసాలు రాశా.. మాతృభాషను మరవొద్దు

22 భాషాల్లో వ్యాసాలు రాశా.. మాతృభాషను మరవొద్దు

మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రతి ఒక్కరు అమ్మభాషను నేర్చుకోవాలి, మాట్లాడాలన్నారు. హైదరాబాద్ లో స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన మాతృభాష దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు వెంకయ్య. పార్లమెంటు సభ్యులందరికీ వారి,వారి భాషల్లో ప్రత్యేకంగా విషెస్ తెలిపానన్నారు. 22 భాషాల్లో స్థానిక పత్రికల్లో వ్యాసాలు కూడా రాశానని చెప్పారు. అన్నీ భాషలు నేర్చుకోవాలి కానీ అమ్మ భాషను, అసలు భాషను మర్చిపోకూడదన్నారు. ప్రాథమిక విద్యను మాతృభాష లోనే నేర్చుకోవాలని..ప్రభుత్వాలు దీన్ని తప్పనిసరి చేయాలన్నారు. ప్రభుత్వ పరిపాలనా, న్యాయ పాలనా, కోర్ట్, వైద్యం, సైన్స్, ఇంజనీరింగ్ ఇవన్నీ మొదటి ప్రాధాన్యత మాతృభాషకే ఇవ్వాలన్నారు.

అనారోగ్యంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత.. ఆదుకోవాలంటూ వేడుకోలు