జనసేన ఎమ్మెల్యే ను డబ్బులు అడగలేదు : బాధితురాలు వీణ

జనసేన ఎమ్మెల్యే ను డబ్బులు అడగలేదు : బాధితురాలు వీణ
  •     ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు

జూబ్లీహిల్స్, వెలుగు: ఏపీలోని జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్​ను తాను డబ్బులు అడగలేదని  బాధితురాలు వీణ తెలిపారు.  తాను ఆయనను రూ. 25 కోట్లు అడిగినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. బుధవారం బంజారాహిల్స్ లోని రోడ్ నం.2లో ఆమె మాట్లాడుతూ.. తనను పెళ్లి చేసుకుంటాడని శ్రీధర్ ఇంట్లో కూడా అందరికీ తెలుసన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రతిసారీ అరవ శ్రీధర్ వీడియో కాల్ చేసే వారని తెలిపారు. 

ఎమ్మెల్యే శ్రీధర్​కు తనతోనే కాకుండా మరో ఐదుగురు మహిళలతో కూడా సంబంధం కొనసాగించేవాడని తెలిపారు. ఈ విషయం తనకు తెలిసి అతనితో దూరంగా ఉండేందుకు నిర్ణయించుకుని, కొన్ని ఆధారాలను సేకరించి పెట్టుకున్నట్లు బాధితురాలు వివరించారు. తనుకు న్యాయం కావాలని  కోరడంతోనే ఎన్​హెచ్ఆర్సీ సపోర్టుతో ఆయనపై కేసు నమోదయిందన్నారు.

అనంతరం వీణ తరఫు అడ్వకేట్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే  అఫిడవిట్‌లో ఆదాయం రూ.3 లక్షలుగా చూపించిన శ్రీధర్​ను రూ.25 కోట్లు ఎలా డిమాండ్ చేస్తామన్నారు. అంటే ఆయన దగ్గరేమైనా బ్లాక్ మనీ ఉందా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై చర్చ జరిగే అసెంబ్లీలో ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడడంపై స్పీకర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.