హైదరాబాద్: శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేశారు. కార్యాలయంలోని పలు రికార్డులు, పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత కొంతకాలంగా కార్యాలయ నిర్వహణపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే.. విజిలెన్స్ అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. తనిఖీల సందర్భంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రికార్డుల నిర్వహణ, ఇతర పరిపాలనా అంశాలను పరిశీలిస్తున్నారు.
శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కూడా మే నెలలో ఏసీబీ అధికారులు రెండు సార్లు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అవినీతి ఆరోపణలు, బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. కార్యాలయానికి చేరుకున్న అధికారులు గేట్లు మూసివేసి, సిబ్బందిని బయటకు వెళ్లనివ్వకుండా గంటల తరబడి సోదాలు నిర్వహించారు.
ALSO READ : కూకట్ పల్లిలో దారుణం..
భూ రికార్డుల మార్పులు, రిజిస్ట్రేషన్ల కోసం కొందరు అధికారులు భారీగా ముడుపులు డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, వీఆర్వోలు, ఉన్నతాధికారుల వద్ద ఉన్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అవినీతికి పాల్పడే ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదని డీఎస్పీ స్పష్టం చేశారు.
