బతకాలంటే గెలవాల్సిందే.. లైగర్ హంట్ మామూలుగా లేదు

బతకాలంటే గెలవాల్సిందే.. లైగర్ హంట్ మామూలుగా లేదు

విజయ్ దేవర కొండ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది.  చిత్ర యూనిట్ లైగర్ హంట్ థీమ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది. ఈ హంట్ థీమ్ లో విజయదేవర కొండ వేటాడే సింహాలా  కనిపిస్తున్నాడు. విజయ్ లుక్, యాక్షన్ ఆకట్టుకున్నాయి. సిక్స్ ప్యాక్ దేహంతో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ని ప్రాక్టీస్ చేస్తూ అదరగొట్టాడు. వీడియోతో పాటు విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ లుక్ స్టన్నింగ్ గా వుంది. 

ఈ హంట్ థీమ్ ని విక్రమ్ మాంట్రోస్ కంపోజ్ చేయగా హేమచంద్ర ఫుల్ ఎనర్జీటిక్ గా పాడారు. భాస్కరభట్ల అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. ‘బతకాలంటే గెలవాల్సిందే, ఎగరాలంటే రగలాల్సిందే, నువ్వు పుట్టిందే గెలిచెటందుకు, దునియా చమడాల్ వలిచెటందుకు, అది గుర్తుంటే ఇంకేం చూడకు ఎవడు మిగలడు ఎదురుపడెందుకు ఛల్ లైగర్’ అంటూ అదిరిపోయింది.  హంట్ థీమ్ కోసం భాస్కరభట్ల రాసిన ఈ మాటలు ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. మొత్తానికి లైగర్ హంట్ థీమ్ మరిన్ని అంచనాలని పెంచింది. 

పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా కనిపిస్తుండగా.. లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు.  పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్  కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా  సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.  ఆగస్టు 25న ఈ మూవీ రిలీజ్ కానుంది.