బెదిరింపులు..దాడులకు భయపడం:విజయమ్మ

బెదిరింపులు..దాడులకు భయపడం:విజయమ్మ

షర్మిలకు బెయిల్ మంజూరు కావడంతో విజయమ్మ సంతోషం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని..న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్నారు. ఎవరి బెదిరింపులు, దాడులకు భయపడబోమన్నారు. వైఎస్ షర్మిల పాదయాత్రను కంటిన్యూ చేస్తారని తెలిపారు. డిసెంబర్ 7న వరంగల్ సభకు తాను హాజరవుతానని చెప్పారు. టీఆర్ఎస్ సర్కార్ అహంకారంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు తమకు మద్దతు ఇవ్వడం హర్షనీయమన్నారు. 

షర్మిల రాక కోసం విజయమ్మ లోటస్ పాండ్ లోని కూతురి ఇంటి దగ్గర గేట్ బయట వేచి చూస్తున్నారు. షర్మిలకు హారతి ఇచ్చి లోపలికి పిలుచుకొని వెళ్లేందుకు  కార్యకర్తలతో కలిసి ఎదురుచూస్తున్నారు విజయమ్మ. 

నాంపల్లి కోర్టులో వైఎస్ షర్మిలకు ఊరట దక్కింది. కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. షర్మిలతోపాటు మరో ఐదుగురికి బెయిల్​ మంజూరు చేసింది న్యాయస్థానం.సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో పాటు డ్యూటీలో ఉన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసులు పెట్టారు SR నగర్ పోలీసులు. షర్మిల పాటు YSRTP చెందిన మరో ఐదుగురి పై కేసులు నమోదు చేశారు.  షర్మిలకు బెయిల్​ మంజూరు కావడంతో విజయమ్మ దీక్షను విరమించారు.