
విజయవాడ :- కరోనా నేపథ్యంలో విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాలపై ఆలయ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే నెల 17 వ తేదీ నుంచి 25 వరకు దసరా మహోత్సవాలు జరగబోతున్నాయి. దసరా మహోత్సవాల సమయంలో రోజుకు 10వేలమందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. దేవస్థానం సిబ్బంది, అర్చకులకు కరోనా టెస్టులు తప్పనిసరి అని తెలిపింది. ఇక అమ్మవారి దర్శనానికి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.