విజయవాడ ఉగ్ర లింకుల కేసుకు సంబంధించి విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన ఆరుగురు నిందితుల కస్టడీ ముగియడంతో రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆన్ లైన్ గేమ్స్ ఐడీల ద్వారా యువతకు ఎర వేసినట్లు గుర్తించారు పోలీసులు. గేమ్ లో పై లెవెల్స్ కి వెళ్లేందుకు డబ్బులు చెల్లించి యువతలో నమ్మకం కల్పించి.. వారిలో జిహాదీ భావజాలం నూరిపోశారని తెలిపారు పోలీసులు.
ఉగ్ర లింకుల కేసులో ఆరుగురు నిందితులను ఐదు రోజుల పాటు పలు కోణాల్లో విచారించారు పోలీసులు. నిందితులు ఒకరికొకరు అంతకుముందు పరిచయం లేకపోయినా సామజిక మాధ్యమాల్లో ఎందుకు కలిశారని ప్రశ్నించారు పోలీసులు. ఈ క్రమంలో నిందితులు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడేవాళ్లమని..ఆ ఐడీల ద్వారా విదేశీ హ్యాండ్లర్లు వీరికి గాలం వేశారని.. ఈ గేమ్ లో తదుపరి లెవెల్స్ కి వెళ్లేందుకు విదేశీ హ్యాండ్లర్లే డబ్బులు చెల్లించారని తెలిపారు. ఇలా యువతను ట్రాప్ లోకి లాగి తర్వాత తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించారని తెలిపారు పోలీసులు.
ఫ్రీ ఫైర్ గేమ్ నుండి ఇన్స్టాకు కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ మళ్లించి కథ నడిపారని తెలిపారు పోలీసులు. వీరిలో జిహాద్ భావజాలాన్ని నింపి ఆత్మహుతి దాడికి తెగబడేలా ప్రేరేపించారని తెలిపారు పోలీసులు. భారత్ లో జాతీయ జెండాకు బదులు ఐసీస్ జెండా పెట్టడం తమ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలిపారు నిందితులు. A nation led by Mohamed wil not surrender అని పెట్టీ యువత ను ఐసీస్ వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారని తెలిపారు.
కర్త కర్మ క్రియా అంతా ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన షుకూర్ అనే ఉగ్రవాది గా గుర్తించామని తెలిపారు పోలీసులు. జిహాద్ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నవారిని గుర్తించే పనినీ వీరికి షుకూర్ అప్పగించాడని.. ఇప్పటి వరకు షుకూర్ ను కలవలేదని నిందితులు చెప్పినట్లు తెలిపారు పోలీసులు. త్వరలో దేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ ను కల్పిస్తానని షుకూర్ చెప్పాడని నిందితులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 11 రాష్ట్రాల్లో 42 మందికి లింక్ ఉన్నట్టు గుర్తించామని తెలిపారు పోలీసులు .Benx.com అనే వెబ్ సైట్ ద్వారా కేవలం సోషల్ మీడియాలో మాత్రమే షుకూర్ నిందితులతో కమ్యూనికేట్ అయ్యేవాడని తెలిపారు పోలీసులు.

