సకల గణాలకు అధిపతి గ‌ణ‌ప‌తి

సకల గణాలకు అధిపతి గ‌ణ‌ప‌తి

తొలి పూజలు అందుకునే దేవుడు..విఘ్నాలను బాపే వినాయకుడు..
మండపాల్లో కొలువైన రోజు ఆయనకు పూలు, పండ్లు, కాయలు,ఆకులతో ఘనంగా పూజలు చేస్తాం. ఆయనకు సమర్పించే ప్రతిదానికి ఒక అర్థం, చేసే ప్రతి పూజకు ఒక పరమార్థం ఉంది. భాద్రపద శుద్ద చవితినాడు నియమ నిష్టలతో ఆచరించే వ్రతమే వినాయకచవితి. ఈ వ్రతాన్ని స్వయంగా పరమశివుడే కుమారస్వామికి వివరించాడు. వినాయక చవితిరోజు వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోతాయి. సుఖాలు కలుగుతాయి. సకల విశ్వం వినాయకుడిలోనే ఇమిడి ఉంది. వినాయకుడి వ్రతం అంటే పూజ చేయడం మాత్రమే కాదు. జ్ఞానం సంపాదించడం, ఏకాగ్రతతో ప్రశాంతత పొందడం. పర్యావరణాన్ని  పరిరక్షించుకోవడం. వ్యాధులకు దూరంగా ఉండటం.

విగ్రహమే ఒక విశ్వం
వినాయకుడిని కొలిస్తే.. విశ్వాన్ని కొలిచినట్లే. ఒక్క వినాయకుడి విగ్రహంలోనే లోకమంతా కనిపిస్తుంది. చిన్న ఎలుకపై వినాయకుడు ఉండటం.. పరిపూరమైన ఈ విశ్వానికి గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్లు మేధస్సుకు సంకేతాలు. నాలుగు చేతులు మానవాతీత సామర్థ్యాలకు, తత్వానికి ప్రతి రూపాలు. చేతిలో ఉండే పాశ, అంకుశములు బుద్ధి, మనసులను మంచి మారగం్ లో నడిపించు సాధనాలు. మొత్తంగా వినాయకుడి విగ్రహమే.. విజ్ఞానం కోసం చేయవలసిన కృషికి సంకేతం.

కొలిచే తీరుతో ప్రశాంతత
వినాయకుడి పూజ చేయడమంటేనే ధ్యానం చేయడం. ఒక క్రమపద్ధతిలో పూజలు చేయడం ఏకాగ్రతను పెంచుతుంది. దీనివల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుంది. ప్రశాంతత దొరుకుతుంది.

వ్యాధులు దూరం
ప్రకృతిలో దొరికే పత్రులతో పూజించడం వల్ల వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. దీంతో పాటు పూజించేవాళ ఆ్ల రోగ్యానికి మేలు కలుగుతుంది. గణపతిని పూజించే 21 రకాల పత్రుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఔషధ గుణాలు కళ్లు, చర్మం, మూత్ర సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. ఆకులను చేతితో ముట్టుకోవడం, వాటి సువాసనను పీల్చడం వల్ల బ్రీతిం గ్ సమస్యలు దూరమవుతాయి.

పాలవెల్లి..
వినాయకుడే విశ్వం అని చెప్పేందుకు పాలవెల్లి ఓ ఉదాహరణ. భూమి, సూర్యుడు, గ్రహాలు..ఇలా సౌరకుటుంబం అంతా పాలవెల్లి అనే ఖగోళ ప్రదేశంలో ఉంది. అందుకే వినాయకచవితి రోజు విగ్రహంపైన దీర్ఘ చతురస్రాకార చట్రంలో పాలవెల్లిని ఏర్పాటు చేస్తారు.

గుంజీలు తీయడంతో జ్ఞానం

పూజలో విగ్రహం దగ్గర పుస్తకాలు పెట్టి, గుంజీలు తీస్తాం. ఇదంతా కూడా జ్ఞానానికి ప్రతీకే. చేతులతో చెవులు పట్టుకుని 21 సార్లు గుంజీలు తీయడంతో జ్ఞానం పెరుగుతుంది. గణపతికి ప్రీతిపాత్రమైన గరికలో కూడా ఔషధగుణాలున్నాయి. ఇలా.. ఆ పూజ వెనకున్న రహస్యాన్ని అర్థం చేసుకున్నవారికి కచ్చితంగా ముక్తిని ప్రసాదిస్తాడు దేవదేవుడు. అందుకే ఈ చవితినాడు
వినాయకుడ్ని పూజించి.. ఆ పూజలోని పరమార్థాన్ని గ్రహిద్దాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం