విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ట్ నుంచి ఎలక్ట్రిక్ టూవీలర్లు

విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ట్ నుంచి ఎలక్ట్రిక్ టూవీలర్లు

న్యూఢిల్లీ: వియత్నాం ఈవీ కంపెనీ  విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ట్ ఈ ఏడాదే ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తామని ప్రకటించింది.  కంపెనీ తన తమిళనాడు ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేకంగా టూ వీలర్ తయారీ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఏర్పాటు చేస్తోంది.  ఏడాదికి  10 లక్షల యూనిట్లను  ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

వియత్నాం ప్రముఖ ఈవీ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారత్ లో తన సరికొత్త ఎలక్ట్రిక్  స్కూటర్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. 2026  చివరి నాటికి లేదా పండుగ సీజన లో మార్కెట్లో రానున్నాయి. 

తమిళనాడులోని తూత్తుక్కుడి ప్లాంట్‌లో తయారయ్యే ఈ స్కూటర్లు..ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 140 కిమీల పరిధిని అందించగలవు. సులభంగా మార్చుకోగల బ్యాటరీ టెక్నాలజీ ఉండే అవకాశం ఉంది.