V6 News

ICC ర్యాంకింగ్స్: కోహ్లీ 5 స్థానం, 6వ స్థానంలో రాహుల్‌

ICC ర్యాంకింగ్స్: కోహ్లీ 5 స్థానం, 6వ స్థానంలో రాహుల్‌

ఐసీసీ లేటెస్టుగా టీ20 ర్యాంకింగ్స్‌ ను విడుదల చేసింది. ఇందులో టీమిండి కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఆరో ర్యాంకును దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ డేవిడ్‌ మలన్‌ (888 రేటింగ్‌), ఆరోన్‌ ఫించ్‌ (830), బాబర్‌ ఆజామ్‌ (828), డేవిడ్‌ కాన్వే (774) వరుసగా 1,2,3,4 స్థానాల్లో నిలిచారు.

విరాట్‌ రేటింగ్‌ పాయింట్లు 762 సాధించగా.. రాహుల్‌ 743 రేటింగ్ పాయింట్లన సాధించాడు. తాజా ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో నిలిచిన భారత ఆటగాళ్లు వీరిద్దరే. మరోవైపు వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ (2), రోహిత్‌ శర్మ (3) టాప్‌-5లో కొనసాగుతున్నారు. బాబర్‌ ఆజామ్‌ వారి ముందు స్థానంలో నిలిచాడు.

బౌలర్ల లిస్టులో జస్ప్రీత్‌ బుమ్రా ఒక్కడే టాప్-10లో నిలిచాడు. ఆరో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా తొమ్మిదో ర్యాంకులో ఉన్నాడు.