త్వరలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించాడు. UAEలో అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న T20 వరల్డ్ కప్ తర్వాత భారత T20 కెప్టెన్‌గా తాను తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ఇవాళ( గురువారం) స్పష్టం చేశారు. ఐదారేళ్లుగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నానని.. పని ఒత్తిడి కారణంగాఈ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ ట్విటర్ ద్వారా ట్వీట్ చేశాడు. అయితే..టెస్టు, వన్డే జట్లకు తాను నాయకత్వం వహిస్తానని చెప్పాడు.
రోహిత్ శర్మతో సహా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, సహచరులను సంప్రదించిన తర్వాత తాను ఈ నిర్ణయం తీసుకున్నానని విరాట్ కోహ్లీ చెప్పాడు. కోహ్లీ తప్పుకున్న తర్వాత టీ20 ఫార్మాట్‌కు రోహిత్‌శర్మ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని క్రీడానిపుణులు భావిస్తున్నారు.
#ViratKohli to step down from captaincy in T20Is after World Cup https://t.co/2ttvDCKWze
— Zee News English (@ZeeNewsEnglish) September 16, 2021

