Sehwag vs Ashwin: ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఫాలోవర్స్ తగ్గిపోతారు.. సెహ్వాగ్, అశ్విన్ మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్

Sehwag vs Ashwin: ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఫాలోవర్స్ తగ్గిపోతారు.. సెహ్వాగ్, అశ్విన్ మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్

Sehwag vs Ashwin: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా భారత మాజీ క్రికెటర్లు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ మ్యాచ్‌తో హిందీ కామెంటేటర్‌గా అశ్విన్ ఎంట్రీ ఇచ్చాడు. కొత్తగా హిందీ కామెంట్రీ ప్యానెల్‌‌లో చేరిన అశ్విన్‌కు సీనియర్‌గా సెహ్వాగ్ కొన్ని కీలకమైన సూచనలు జారీ చేశాడు.

ఈ రోజు మనం లాజిక్, ఆలోచనతో కాకుండా మనసుతో మాట్లాడుదాం అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. వెంటనే అశ్విన్ మాట్లాడుతూ.. 'మా అమ్మనాన్నలు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని, ఆలోచించకుండా ఏదీ అనొద్దని నేర్పించారు.. మీరు మాత్రం దానికి విరుద్దంగా చెబుతున్నారని తెలిపారు. దానికి సెహ్వాగ్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చి నవ్వులు పూయించాడు. అయితే అశ్విన్‌కు యూట్యూబ్ ఛానెల్ ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. కొందరు వ్యక్తులు కావాలనే ఆలోచించి మాట్లాడుతారు.. వారు ఏమనుకుంటారంటే.. 'ఈ ఆటగాడికి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు.. నేను గనుక అతని గురించి నెగటివ్‌గా మాట్లాడితే.. నా ఫాలోవర్లు తగ్గిపోతారు.. అదే పాజిటివ్‌గా మాట్లాడితే.. నా ఫాలోవర్లు మరింత పెరుగుతారని అనుకుంటారని వీరేంద్రుడు చెప్పాడు. దీంతో అక్కడ నవ్వులు చిందించారు. 

►ALSO READ | IPL 2026: MI vs KKR మధ్య హై వోల్టేజ్ పోరు.. ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారంటే?

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ సమష్టి ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 రన్స్ చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(80) హాఫ్ సెంచరీతో రాణించగా, అనికేత్ వర్మ, క్లాసెన్ మెరుపులతో ఎస్ఆర్ హెచ్ భారీ స్కోర్ చేసింది. అనంతరం టార్గెట్ ఛేదించేందుకు దిగిన ఆర్‌సీబీ కేవలం 15.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసి ఈజీగా విజయం సాధించింది. దేవదత్ పడిక్కల్(61), విరాట్ కోహ్లీ(69*) హాఫ్ సెంచరీలతో ఈ గెలపులో కీలక పాత్ర పోషించారు.