ఇంగ్లండ్ను వీడని మద్యం వివాదాలు.. ఈసారి బ్రైడన్ కార్స్ దొరికేశాడు..

ఇంగ్లండ్ను వీడని మద్యం వివాదాలు.. ఈసారి బ్రైడన్ కార్స్ దొరికేశాడు..

లండన్‌‌‌‌‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ జట్టును మద్యం వివాదాలు వీడటం లేదు. తాజాగా పేస్‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌ బ్రైడన్‌‌‌‌‌‌‌‌ కార్స్‌‌‌‌‌‌‌‌ నైట్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌ బయట పోలీసుల అదుపులో హ్యాండ్‌‌‌‌‌‌‌‌ కప్స్‌‌‌‌‌‌‌‌తో కనిపించడం కలకలం రేపింది. శనివారం డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ కౌంటీ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో తన క్లబ్ జట్టు డర్హామ్‌‌‌‌‌‌‌‌.. డెర్బీషైర్‌‌‌‌‌‌‌‌పై గెలిచిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది.

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో జరిగిన తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌ కోసం గత వారం కార్స్‌‌‌‌‌‌‌‌ను ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకున్నారు. కానీ తుది జట్టులో చాన్స్‌‌‌‌‌‌‌‌ రాకపోవడంతో అతను డర్హామ్‌‌‌‌‌‌‌‌ జట్టు తరఫున ఆడేందుకు వెళ్లాడు. కార్స్‌‌‌‌‌‌‌‌తో పాటు బౌలర్‌‌‌‌‌‌‌‌ మాథ్యూ పాట్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఉన్నాడు.

కార్స్‌‌‌‌‌‌‌‌ చేతులకు బేడీలు వేసి ఉన్నప్పుడు స్టోక్స్ అతన్ని చూస్తున్నట్లుగా సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వీడియో వైరల్‌‌‌‌‌‌‌‌గా మారింది. తాజా సంఘటనతో కార్స్‌‌‌‌‌‌‌‌ను పాక్‌‌‌‌‌‌‌‌తో జరిగే రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ బోర్డు వర్గాలు వెల్లడించాయి.