అమెరికాలో దారుణ ఘటన జరిగింది. కన్న తల్లిదండ్రులనే కడతేర్చాడు ఓ దుర్మార్గుడు. పేరెంట్స్ అన్న కనీస ఆలోచన లేకుండా.. నిర్దాక్షిణ్యంగా షూట్ చేశాడు. వారితో పాటు నానమ్మను కూడా చంపేశాడు. టెక్సాస్ లో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో 19 ఏళ్ల విద్యార్థి గౌరవ్ చోప్రాను అరెస్టు చేశారు.
స్థానిక పోలీసు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, జూన్ 17న వర్జీనియాలో జరిగిన ఈ విషాద ఘటనలో గౌరవ్ చోప్రాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తండ్రి సీతారామ్ (56), తల్లి కమ్లేశ్ రాణి (46), అమ్మమ్మ మహిందర్ కౌర్ (73) ఈ ఘటనలో చనిపోయారు. టెక్సాస్ అల్టాన్ లోని ఇంట్లో జరిగింది ఈ దారుణ ఘటన.
ఈ ఘటనలో తన సోదరుడు సాజన్ (21) పై కూడా కాల్పులు జరపగా.. తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు.
నిందితుడు గౌరవ్ చోప్రా టెక్సాస్ రియో గ్రాండే వ్యాలీ యూనివర్సిటీ విద్యార్థి. వర్జీనియాలోని తన ఇంటిలో కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు.
కాల్పుల తర్వాత, నిందితుడు ఒక వెహికిల్ లో పారిపోయాడు. సోదరుడు సాజన్ ఫిర్యాదు మేరకు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఎట్టకేలకుఅరెస్టు చేశారు.
బాధిత కుటుంబం పంజాబ్‌లోని షహీద్ భగత్ సింగ్ నగర్ (నవాన్‌షహర్) జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. 30 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లారు. ఈ మధ్య 5 నెలల క్రితమే ఇండియా వచ్చి తమ బంధువులను కలుసుకుని వెళ్లినట్లు సమాచారం. తండ్రి టెక్సాస్‌లోని పామ్‌వ్యూలో వ్యాపారి. ఈ విషాద ఘటన టెక్సాస్‌లోనూ.. ఇటు పంజాబ్ లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. కాల్పుల వెనుక కారణం ఏంటో ఇంకా తెలియలేదు.
