న్యూఢిల్లీ: ఐఫోన్లలో టెలిగ్రామ్ యాప్‌పై కన్ఫూజన్ నెలకొంది. ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ తమ యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్‌ను తొలగించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ ఆపిల్ స్టోర్‌లో మాత్రం టెలిగ్రామ్ యాప్ యూజర్లకు అందుబాటులో ఉంది. యాప్ ఇన్సాల్ట్ కూడా అవుతోంది. దీంతో టెలిగ్రామ్ యాప్‌పై ఐఫోన్ యూజర్లలో సందిగ్ధం నెలకొంది. ఈ ఘటనపై అటు ఆపిల్ సంస్థ గానీ, టెలిగ్రామ్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అసలేం జరిగిందంటే..?
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ యాప్‌ను ఆపిల్ కంపెనీ తమ యాప్ స్టోర్ నుంచి తాత్కాలికంగా తొలగించినట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. కానీ దీనిని ఆపిల్, టెలిగ్రామ్ కంపెనీలు అధికారికంగా ధృవీకరించలేదు. నిబంధనలకు విరుద్ధమైన బాలల లైంగిక వేధింపుల కంటెంట్ వ్యాప్తి చేస్తోందన్న ఆరోపణల మేరకు ఆపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆపిల్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ కనిపించకుండా పోయింది. ఐఫోన్ వినియోగదారులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోలేకపోయారు.
వెంటనే అప్రమత్తమైన టెలిగ్రామ్ వివాదాస్పద కంటెంట్‌ను తొలగించింది. అలాగే, నిషేధిత కంటెంట్ వ్యాప్తికి కారణమైన వినియోగదారుడిని బ్యాన్ చేసింది. టెలిగ్రామ్ చర్యలతో సంతృప్తి చెందిన ఆపిల్ ఆ యాప్‌పై విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసింది. టెలిగ్రామ్‌ను తిరిగి తమ యాప్ స్టోర్‌లో ఆపిల్ మళ్లీ అందుబాటులోకి తెచ్చింది.
ఐఫోన్లలో టెలిగ్రామ్ డౌన్ లోడ్ కూడా అవుతోంది. కాగా, టెలిగ్రామ్ యాప్‌పై ఆపిల్ కంపెనీ బ్యాన్ విధించడం ఇదే తొలిసారి కాదు. 2018లో కూడా టెలిగ్రామ్‌పై ఆపిల్ నిషేధం విధించింది. కంటెంట్ మోడరేషన్ సమస్యల వల్లే టెలిగ్రామ్‌ను యాప్ స్టోర్ నుండి ఆపిల్ తాత్కాలికంగా తొలగించింది. ఆ తర్వాత టెలిగ్రామ్ భద్రతా ప్రమాణాలు పెంచడంతో మళ్లీ పునరుద్ధరించింది.
