జీహెచ్ఎంసీలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

జీహెచ్ఎంసీలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

హైదరాబాద్ సిటీ, వెలుగు:  స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ సోమవారం ప్రారంభించింది. డిసెంబర్ 5వ తేదీ వరకు 30 సర్కిళ్ల పరిధిలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ‘ప్రగతి 50 సిటీస్’ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం ఒక ప్రత్యేక అంశాన్ని ఎంపిక చేసి, రోజువారీగా పారిశుధ్య పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మొదటి వారానికి విజిబుల్ క్లీన్‌లీనెస్ (కంటికి కనిపించే పరిశుభ్రత) అంశాన్ని ఎంపిక చేశారు. 

ఇందులో భాగంగా సోమవారం ఫుట్‌పాత్‌లు, రోడ్డు మధ్య డివైడర్లు, కూడళ్లు, రౌండ్‌ అబౌట్లను శుభ్రం చేయడంతో పాటు అనధికార పోస్టర్లు, బ్యానర్లను తొలగించారు.  86.05 టన్నుల ఘన వ్యర్థాలు, 22.76 టన్నుల చెత్త, నిర్మాణ వ్యర్థాలను తరలించినట్లు తెలిపారు.