విశాల్ స్వీయ దర్శకత్వంలో ‘మకుటం’ ట్రైలర్ రిలీజ్..

విశాల్ స్వీయ దర్శకత్వంలో ‘మకుటం’ ట్రైలర్ రిలీజ్..

విశాల్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన  చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలో వస్తున్న 99వ సినిమా ఇది. అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టు 14న తెలుగు, తమిళ భాషల్లో  సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ఫుల్ యాక్షన్‌‌‌‌తో మొదలైన ట్రైలర్ కాసేపటికే ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, డ్రామా వైపు టర్న్ తీసుకుంటుంది.

ముఖ్యంగా మూడు విభిన్న గెటప్స్‌‌‌‌లో విశాల్ కనిపించడం, ప్రతి పాత్రకు తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్ మార్చడం ఆకట్టుకుంటోంది. ‘ఆ సరుకుని నేను దించను.. ఇంకెవ్వరినీ దించనివ్వను రా’ అంటూ లింగా, కృపాకర్ పాత్రల్లో విశాల్ చెప్పే డైలాగ్‌‌‌‌ను  హైలైట్‌‌‌‌ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచింది. అంజలి, దుషార విజయన్ తమదైన రోల్స్‌‌‌‌లో అలరించగా, జీవీ ప్రకాష్ అందించిన బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు  అదనపు బలంగా నిలిచింది.