ఆ రెండింటిలో కేటీఆర్ ఫెయిల్

ఆ రెండింటిలో కేటీఆర్  ఫెయిల్


దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ దళితుడుని సీఎంని చేయలేదు కానీ తన కొడుకును CM  చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి. TRS వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్  ఫెయిల్ అయ్యాడన్నారు. లివింగ్ సిటీ ర్యాంక్ ల్లో హైదరాబాద్  నాలుగో స్థానం నుంచి 24 వ ర్యాంక్ వచ్చిందంటే కేసీఆర్  ..కేటీఆర్ ఎలా పాలన చేస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. కేసీఆర్ దళిత ద్రోహి అని  ప్రభుత్వంలో దళిత అధికారులకు  ప్రాధాన్యత  ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని.. సింగరేణిలో ఖాళీలను భర్తీ చేయడం లేదన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నా నిధులు రావడం లేదని  కేసీఆర్ , కేటీఆర్ అబద్ధాలు చెప్తున్నారన్నారు. కేసీఆర్ చెంప చెల్లు మనేలా బిజెపి MLC అభ్యర్థి రాంచందర్ రావును గెలిపించాలన్నారు.