Telangana municipal elections: తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

Telangana municipal elections: తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం (ఫిబ్రవరి 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‎లకు క్యూ కడుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2,569 వార్డులు, 412 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 52.17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

ఎన్నికల నిర్వహణ కోసం 40 వేల మందికి పైగా సిబ్బందిని నియమించారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్లు, ఇతర పోలింగ్ సామగ్రితో మంగళవారం సాయంత్రమే తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు సిబ్బంది చేరుకున్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ చేస్తోంది. 

కాగా, పోలింగ్ శాతం పెంపుపై ఈసీ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఇందుకోసం 3 ఏఐ వీడియోలను వాట్సప్ గ్రూప్లలో, లోకల్ చానల్స్‎లో సర్క్యులేట్ చేస్తోంది. పోలింగ్‎కు టైం దగ్గర పడడంతో పార్టీలన్నీ పోల్ మేనేజ్ మెంట్‎పై దృష్టి సారించాయి. తమ అభ్యర్థుల గెలుపు కోసం లీడర్లంతా కృషి చేస్తున్నారు. విజయావకాశాలపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.