ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్ .. నాలుగింటికి కౌంటింగ్ ప్రారంభం

ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్ .. నాలుగింటికి కౌంటింగ్ ప్రారంభం

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు కొద్దిసేపటికింద ముగిశాయి. ఈ ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్… 2 గంటలకు ముగిసింది. మాలో 745 ఓట్లున్నాయి. ఇందులో 472 ఓట్లు పోలయ్యాయి. శివాజీ రాజా, నరేష్ ప్యానెళ్ల మధ్య ఎవరి ప్యానెల్ గెలుపొందుతుందనేది ఈ సాయంత్రం విడుదలయ్యే ఫలితాల్లో తేలిపోనుంది. కౌంటింగ్ సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది.