హైదరాబాద్: ఐపీఎల్ 19లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో సీఎస్కే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో అతిథ్య హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇరు జట్లు సేమ్ టీములతో బరిలోకి దిగుతున్నాయి.
ఈ సీజన్లో వరుస విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరింపించి హైదరాబాద్ జోష్‌లో ఉంది. ఇక, హ్యాట్రిక్ ఓటములతో సీజన్ ఆరంభించిన చెన్నై అద్భుతంగా తిరిగి పుంజుకుని చివరి రెండు మ్యాచుల్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది.
జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (సి), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(w), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఎషాన్ మలింగ
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్ (w), రుతురాజ్ గైక్వాడ్ (సి), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్

