అనుమానాస్పద స్థితిలో వీఆర్ఏ మృతి

V6 Velugu Posted on Dec 07, 2021

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. బోధన్ మండలం ఖండ్ గావ్ గ్రామంలో వీఆర్ఏ గౌతమ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. గౌతమ్ ను కొందరు కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇసుకకు సంబంధించిన గొడవలే ఈ హత్యకు కారణమని వారన్నారు. తమకు న్యాయం చేయాలంటూ గౌతమ్ కుటుంబ సభ్యులు బోధన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. వారికి మద్ధతుగా స్థానిక వీఆర్ఏలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయని వారన్నారు.

Tagged Telangana, NIzamabad, bodhan, VRA died, sand illegal transport, VRA goutham

Latest Videos

Subscribe Now

More News