ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద వీఆర్ఏల ధర్నా..పోలీసుల లాఠీచార్జ్

ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద వీఆర్ఏల ధర్నా..పోలీసుల లాఠీచార్జ్

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. 79 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్ఏలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.  

అంతకుముందు ధర్నాచౌక్ దగ్గర నిరసన తెలపడానికి పెద్దఎత్తున తరలివచ్చిన వీఆర్ఏలను..అనుమతి లేదంటూ  పోలీసులు అడ్డుకున్నారు. కొంతమంది వీఆర్ఏలు పోలీసులను దాటుకుని వెళ్లి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ధర్నా నిర్వహించారు. వీఆర్ఏల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వీఆర్ఏలు ఉదయం నుంచి దశలవారీగా హైదరాబాద్కు తరలిరాగా.. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.