నాలుగు రోజులే పని!
రోజూ ఆఫీసుకు వెళ్లేవాళ్లకి ఒకటే ఆలోచన. ‘వీకెండ్ ఎప్పుడు వస్తుందా?’ అని. వారం చివరన వచ్చే ఆ రెండు రోజుల కోసం వారం మొత్తం ఎదురుచూస్తారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్. రెండు రోజులు టైం దొరికితే ట్రిప్పుల మీద ట్రిప్పులు ప్లాన్ చేసుకుంటారు. ఇక వారంలో నాలుగు రోజులు మాత్రమే పని అయితే. పట్టపగ్గాలు ఉంటాయా!
అందుకేనేమో చాలా దేశాలు ఇప్పుడు వారానికి నాలుగు రోజులు మాత్రమే వర్కింగ్ అవర్స్ పెడుతున్నాయి. ఎంప్లాయిస్ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, ప్రొడక్టివ్‌గా పని చేసేందుకు దీన్ని అమలు చేస్తున్నాయి. న్యూజిలాండ్, జపాన్, ఐర్లెండ్, స్కాట్‌లాండ్‌లో ఇప్పటికే మూడు రోజులు వీకెండ్ ఉండగా.. రీసెంట్‌గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాలుగున్నర రోజుల వర్కింగ్ డేస్ పెట్టింది. కాగా.. షార్జా కూడా ఆ బాటలోనే నడుస్తోంది. జనవరి 1 నుంచి షార్జాలో వీకెండ్ శుక్రవారమే మొదలుకానుంది. ఇక యూఏఈలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వీకెండ్ మొదలవుతుంది. దీంతో ఆ దేశాల్లో పనిచేసేందుకు ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారట. ‘వారంలో నాలుగు రోజులే పని చేయడాన్ని ఎవరు వదులుకుంటారు?” అంటున్నారు కొంతమంది ఎంప్లాయిస్. వెంటనే ఆ దేశాలకు ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’ అని అక్కడ పనిచేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
