వరంగల్ జిల్లా : ప్రియుడే హంతకుడు..వివాహిత మర్డర్ కేసులో ..నిందితుడి రిమాండ్

వరంగల్ జిల్లా : ప్రియుడే హంతకుడు..వివాహిత మర్డర్ కేసులో ..నిందితుడి రిమాండ్

నర్సంపేట, వెలుగు: వరంగల్​ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురంలో ఇటీవల జరిగిన వివాహిత మర్డర్​ కేసును పోలీసులు ఛేదించారు. నర్సంపేట ఏసీపీ ఆఫీసులో మంగళవారం ఏసీపీ రవీందర్​రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. 

దుగ్గొండి మండలం లక్ష్మీపురంకు చెందిన తాళ్లపల్లి సుమలత ఈ నెల 20న అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె భర్త  ఐదేళ్ల కింద చనిపోగా, అదే గ్రామానికి చెందిన పాండవుల సురేశ్​తో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా సురేశ్​ను పట్టించుకోకపోవడం, ఫోన్​ బిజీ వస్తుండడంతో సుమలతపై అనుమానం పెంచుకున్నాడు.

 ఈక్రమంలో సుమలతను చంపాలని ప్లాన్​ చేసి, ఈ నెల 20న వరంగల్​కు రమ్మని పిలిచాడు. సాయంత్రం ఇద్దరు కలిసి బైక్​పై వరంగల్​ నుంచి బైక్​పై లక్ష్మీపురం బయలుదేరారు. కాశీబుగ్గలో కత్తి కొనుగోలు చేసి బైక్​లో పెట్టుకున్నాడు. 

లక్ష్మీపురం శివారులోని ఎస్సారెస్పీ కెనాల్​ వద్దకు రాగానే మరొకరితో చనువుగా ఉంటున్నావని సుమలతతో వాగ్వాదానికి దిగాడు. మద్యం మత్తులో ఉన్న సురేశ్​​ఆమెపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోసి చంపి పరారయ్యాడు. కాల్​ డేటా, సీసీ పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపినట్లు ఏసీపీ తెలిపారు.