చికెన్ను ట్యాప్ వాటర్ కింద కడుగుతున్నారా? జాగ్రత్త!

చికెన్ను ట్యాప్ వాటర్ కింద కడుగుతున్నారా? జాగ్రత్త!

చికెన్ ను ట్యాప్ వాటర్ కింద కడుగుతున్నారా? అయితే జాగ్రత్త. చికెన్ ను నీటిధార కింద కడగటం వల్ల ఆ తుంపర్లు  వంటగది అంతా చిమ్మి ప్రమాదకరమైన కాంపైలో బాక్టర్, సాల్మొనెల్లా అనే బాక్టీరియాలు వ్యాపిస్తాయని ఆస్ట్రేలియా ఫుడ్ సేఫ్టీ కౌన్సిల్ సర్వేలో వెల్లడైంది. వీటి వల్ల అనేక వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రేలియా  గత 20 ఏళ్లలో ఆస్ట్రేలియాలో కాంపైలో బాక్టర్, సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ లు రెట్టింపయినట్లు తెలిపాయి.

అయితే హై టెక్నాలజీతో మాంసం ఉత్పత్తి చేస్తున్న ఈ రోజుల్లో చికెన్ ను కడగాల్సిన అవసరం లేదంటున్నారు. ఒక వేళ చికెన్ ను కడగాలనుకుంటే.. పాత్రలో వాటర్ పోసి ముంచి కడుక్కోవాలని  సూచిస్తున్నారు.కొందరు చికెన్ ను వెనిగర్, నిమ్మరసంతో కడుగుతుంటారు. కానీ అలా కడగడం వల్ల కూడా వైరస్ వ్యాపిస్తుందని చెబుతున్నారు.