హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్‌లో ఉన్న పాత బ్యాలెన్సింగ్ ట్యాంక్ క్లీనింగ్ పనుల కారణంగా పలు ప్రాంతాల్లో మే 2వ తేదీన పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు పనులు కొనసాగుతాయన్నారు.
దీంతో 24 గంటల పాటు రెడ్ హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీ నగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్‌నగర్, సౌత్ సెంట్రల్ రైల్వే, నాంపల్లి, గన్‌ఫౌండ్రీ, చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, అహ్మద్ నగర్, కవాడిగూడ వార్డ్, గాంధీనగర్ వార్డ్, దోమలగూడ, బంజారాహిల్స్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఉండదన్నారు.

