
హైదరాబాద్, వెలుగు : కరోనా వ్యాక్సిన్ల ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్‌ను హ్యాండిల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో(జీహెచ్‌ఏసీ) తెలిపింది. కరోనా వ్యాక్సిన్‌ను డెవలప్ చేయడం ఒక ఎత్తు అయితే.. దాన్ని ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేయడం మరో సవాలుగా నిలుస్తోంది. జీహెచ్‌ఏసీ కూడా ఎండ్ టూ ఎండ్ అన్‌బ్రోకెన్ కూల్ చెయిన్‌ను వ్యాక్సిన్ షిప్‌మెంట్లకు అందించనున్నట్టు చెప్పింది. గత 12 ఏళ్ల నుంచి ఫార్మాకు అన్‌బ్రోకెన్ కూల్ చెయిన్‌ను జీహెచ్‌ఏసీ అందిస్తోంది.