ఆసియా కప్‌‌‌‌‌‌‌‌, వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ కూడా ఫ్రీ లైవ్‌‌‌‌‌‌‌‌

ఆసియా కప్‌‌‌‌‌‌‌‌, వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ కూడా ఫ్రీ లైవ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను ఉచితంగా వీక్షించిన క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు మరో గుడ్‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌, వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను డిస్నీ, హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో  ఫ్రీగా చూడొచ్చు. ఈ మేరకు ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ తమ మొబైల్స్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌ లేకుండా ఈ రెండు మెగా టోర్నీలను వీక్షించొచ్చని డిస్నీ శుక్రవారం వెల్లడించింది. మరింత మందికి క్రికెట్‌‌‌‌‌‌‌‌ వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లతో జియో సినిమా సూపర్‌‌‌‌‌‌‌‌ వ్యూయర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ సాధించడంతో ఇప్పుడు డిస్నీ కూడా డిజిటల్​ ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఐసీసీ టోర్నీలకు సంబంధించిన టీవీ రైట్స్‌‌‌‌‌‌‌‌ మొత్తం డిస్నీ హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌ చేతుల్లో ఉండటంతో ఫ్రీ లైవ్‌‌‌‌‌‌‌‌కు గేట్లు తెరిచింది. అయితే టీవీ, ఇతర వాటిలో చూసే వాటికి మాత్రం ఆయా రేట్లు వర్తించనున్నాయి.