న్యూఢిల్లీ: పరీక్షా పేపర్ల లీకేజీ అంశంపై విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనలను ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ‘బిజినెస్ లీడర్‌షిప్ అవార్డ్స్ 2026’ కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సమాజంలో లోపాలను సరిదిద్దాలని కోరుకోవడం యువత సహజ గుణమని, వారి ఆందోళనల స్ఫూర్తిని తాను గౌరవిస్తానని చెప్పారు. నిరసనల తీవ్రతను అర్థం చేసుకోవడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందనడంలో వాస్తవం లేదన్నారు. పేపర్ లీక్ ఘటన వెలుగులోకి రాగానే ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేసిందని గుర్తుచేశారు.
