కిమ్ హెల్త్ కండిషన్ ఎట్లుందో మాకు తెల్వదు: యూఎన్

కిమ్ హెల్త్ కండిషన్ ఎట్లుందో మాకు తెల్వదు: యూఎన్

న్యూయార్క్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అస్వస్థతకు గురయ్యారని, బ్రెయిన్‌ డెడ్‌ అయ్యారని రకరకాల వందంతులు ఇంటర్నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు దీనిపై కొరియా ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వకపోవడంతో అసలేం జరిగిందన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. దీనిపై ఐక్యరాజ్య సమితి(యూఎన్​) శుక్రవారం స్పందించింది. కిమ్ జోంగ్ ఆరోగ్యం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ చెప్పారు. కిమ్ ఆరోగ్యం, ఆచూకీ గురించి ఉత్తర కొరియా అధికారులతో మాట్లాడారా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘‘కిమ్ జోంగ్ ఉన్ పరిస్థితి గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు” అని గుటెర్రస్ సమాధానమిచ్చారు.

కిమ్ ఏప్రిల్ 15న తన తాత నార్త్ కొరియా ఫౌండర్ కిమ్ సంగ్ జయంతి వేడుకల రోజు నుంచి కనిపించకుండాపోయారు. హార్ట్ ప్రాబ్లమ్ కి ట్రీట్ మెంట్ చేస్తుండగా కోమాలోకి వెళ్లాడని, ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ అయ్యాడని వదంతులు వచ్చాయి. ఈ వార్తలను ఉత్తర కొరియా ఇప్పటివరకు ఖండించకపోగా.. దక్షిణ కొరియా మాత్రం ఆయన హెల్దీగానే ఉన్నాడని ప్రకటించింది. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా కిమ్ పరిస్థితి గురించి తనకు చాలా మంచి ఆలోచన ఉంది.. కానీ దాని గురించి మాట్లాడలేనని చెప్పారు.