
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాజేంద్రనగర్ జోన్ పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలో ఇటీవల మొత్తం 36 మంది అక్రమ విదేశీయులు పట్టుబడగా, వారిలో 23 మందిని వారి స్వదేశాలకు తిరిగి పంపినట్లు డీసీపీ తెలిపారు. ఆగస్టు 14న రాత్రి బకారంలోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో 51 మంది విదేశీయులు దొరికిన విషయం తెలిసిందే.
వీరిలో 36 మంది సరైన పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలో ఉంటున్నట్లు తేలింది. వీరిని పోలీసులు డిటెన్షన్ సెంటర్లకు తరలించారు. అనంతరం డీపోర్టేషన్ద్వారా 23 మందిని వారి దేశాలకు తరలించారు. మిగిలిన 9 మంది కోసం సంబంధిత ఎంబసీ నుంచి అనుమతులు పొందడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, అనుమతి రాగానే వీరినీ పంపిస్తామని డీసీపీ తెలిపారు.