సిటీలో 45 ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు పూర్తి చేసిన వీహౌస్

సిటీలో 45 ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు పూర్తి చేసిన వీహౌస్

హైదరాబాద్: కస్టమర్ల కోరిక మేరకు ఇంటిని నిర్మించి ఇచ్చే  వీహౌస్‌‌‌‌‌‌‌‌  ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌  హైదరాబాద్‌‌‌‌లో 45 ప్రాజెక్ట్‌‌‌‌లను పూర్తి చేసింది. 2019లో స్టార్టయిన ఈ కంపెనీ   సిటీలో మరింత విస్తరించేందుకు ప్లాన్స్ వేసుకుంటోంది. 3 నెలల కిందటే చెన్నైలోకి  కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది మే నెలలో  వీహౌస్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ అంథిల్‌‌‌‌ వెంచర్స్‌‌‌‌, కొంత మంది ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి మిలియన్ డాలర్లను సేకరించింది.  కంపెనీ రెవెన్యూ 2019–20 ఆర్థిక సంవత్సరంలో  295 శాతం పెరగగా, 2020–21 లో 482 శాతం, 2020–21 లో 363 శాతం పెరిగిందని  వీహౌస్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది.

ఈ ఏడాది ముగిసేనాటికి రెవెన్యూ రూ. 120 కోట్లు వస్తుందని కంపెనీ అంచనావేస్తోంది. ఇది 620 శాతం వృద్ధి రేటుకి సమానం. ఇప్పటి  వరకు 10 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాను  పూర్తి చేశామని, తమ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ను నెలకు   75 వేల మంది విజిట్ చేస్తున్నారని వీహౌస్  పేర్కొంది. ఇంటిని నిర్మించడంలో అన్ని రకాల సేవలను వీహౌస్ అందిస్తోంది. ప్రాజెక్ట్‌‌‌‌ను మేనేజ్ చేయడం, డిజైన్‌‌‌‌, డెకరేషన్‌‌‌‌, ఇంటీరియర్స్‌‌‌‌, లీగల్ పర్మిషన్స్‌‌‌‌, ఆర్కిటెక్చరల్ సర్వీసులు వంటివి ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తోంది. మెటీరియల్స్‌‌‌‌ను ఎలా వాడుతున్నారు? కన్‌‌‌‌స్ట్రక్షన్ వర్క్ ఎక్కడి వరకు వచ్చింది? వంటి అంశాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో మానిటర్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ ఇస్తోంది. ఇంటి నిర్మాణాన్ని మేనేజ్ చేయడం నుంచి 50 శాతం రెవెన్యూని  వీహౌస్‌‌‌‌ సంపాదిస్తోంది.  మెటీరియల్స్‌‌‌‌ను మేనేజ్ చేయడం నుంచి 30 శాతం రెవెన్యూ, 20 శాతం రెవెన్యూ ఇంటీరియర్ డిజైన్ నుంచి సంపాదిస్తోంది.  

ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో చదరపు అడుగుకు 1,599 ని, చెన్నైలో రూ.1,900 వీహౌస్  ఛార్జ్ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌, చెన్నైలలో 400 ప్రాజెక్ట్‌‌‌‌లపై పనిచేస్తున్నామని, ఒక్క చెన్నైలోనే 120 ప్రాజెక్ట్‌‌‌‌లు సాధించామని కంపెనీ పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఐదు లక్షల చదరపు అడుగుల బిల్టప్‌‌‌‌ ఏరియాను పూర్తి చేయడమే టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్నామని వివరించింది. 100 మంది ఉద్యోగులను నియమించుకునే ప్లాన్‌‌‌‌లో ఉన్న ఈ కంపెనీ మరిన్ని సిటీలకు విస్తరించాలని చూస్తోంది. వచ్చే ఏడాది 500 స్ట్రాటజిక్ పార్టనర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌లు కుదుర్చుకుంటామని కంపెనీ ప్రకటించింది.