సర్ పై ఫైట్ చేస్తం.. రాజకీయంగా, చట్టపరంగా పోరాడతామన్న రాహుల్ గాంధీ

సర్ పై ఫైట్ చేస్తం.. రాజకీయంగా, చట్టపరంగా పోరాడతామన్న రాహుల్ గాంధీ
  • ఈసీ తన బాధ్యతను పొలిటికల్ పార్టీలపై వేస్తోందని విమర్శ
  •   ఇందిరా భవన్‌‌‌‌లో ఏఐసీసీ ఆఫీస్ బేరర్లతో సమావేశం

న్యూఢిల్లీ: దేశంలో ఓటర్ లిస్ట్ లను సవరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై కాంగ్రెస్ నేత, లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈసీ తన బాధ్యతలను పొలిటికల్ పార్టీలపై మోపుతూ.. నిజమైన ఓటర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నదని ఆరోపించారు. 

ఈ విషయంపై రాజకీయంగా, చట్టపరంగా, సంస్థాగతంగా పోరాడాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై సమీక్షించేందుకు ఢిల్లీ ఇందిరా భవన్‌‌‌‌లోని ఏఐసీసీ హెడ్‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌లో సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌‌‌‌లో రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్ సహా సర్ ప్రాసెస్ జరుగుతున్న12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పీసీసీ చీఫ్‌‌‌‌లు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేతలు, సెక్రటరీలతో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.."ఎన్నికల సంఘం ఫెయిర్‌‌‌‌గా, ట్రాన్స్‌‌‌‌పరెంట్‌‌‌‌గా ఓటర్ల లిస్ట్ తయారు చేయాలి. కానీ, అలా చేయకపోగా..తన బాధ్యతలను పొలిటికల్ పార్టీలపై మోపుతున్నది. ఇది పేదల ఓటు హక్కును దెబ్బతీసే ‘ఇన్‌‌‌‌స్టిట్యూషనలైజ్డ్ చోరీ’. మేం దీనిపై రాజకీయంగా, చట్టపరంగా, సంస్థాగతంగా పోరాడుతాం. నిజమైన ఓటర్లను తొలగించడమే సర్ ఉద్దేశం. సర్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ తీవ్ర నిరాశపరుస్తున్నది. ఈ ప్రక్రియను "ఓటు చోరీ" కోసం ఆయుధంగా మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. బీజేపీ నీడలో ఈసీ పనిచేయడం లేదని పోల్ బాడీ నిరూపించుకోవాలి. ఓటర్ జాబితాల సమగ్రతను కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ  కట్టుబడి ఉంది" అని పేర్కొన్నారు.