మరో మూడ్రోజులు వానలు

మరో మూడ్రోజులు వానలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలోని పలు చోట్ల రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌‌‌‌ ఉందని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని పేర్కొంది. పలు జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. సిద్దిపేట జిల్లాలోని సముద్రాలలో 6.1 సెం.మీ., సంగారెడ్డిలోని సాత్వార్‌‌‌‌లో 4సెం.మీ., జనగాంలోని తాటికొండలో 2.3, కామారెడ్డిలోని గాంధారిలో1.6 సెం.మీ. చొప్పున వర్షపాతం రికార్డయ్యింది.