రేపు రాష్ట్రానికి వర్ష సూచన

రేపు  రాష్ట్రానికి వర్ష సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పలు చోట్ల గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ థాయిలాండ్ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని ఇది గురువారం నాటికి వాయుగుండంగా మారుతుందని, ఆ తర్వాతి 24 గంటల్లో తుఫానుగా మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం కావొచ్చని చెప్పింది. 4వ తేదీకి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరానికి చేరుకోవచ్చని అంచనా వేసింది.