కాల చక్రంలో మరొక నూతన వారం (ఆగస్టు 30) ప్రారంభమైంది. జ్యోతిష్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారంఆగస్టు 30నుంచి సెప్టెంబర్ 5 వ తేది వరకు జరిగే గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారి జాతక ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.. .!
మేషరాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగా కలసి వచ్చే అవకాశాలున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు.ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృషభరాశి: ఈ రాశి వారికి ఈ వారంలో ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశాలున్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తుల విషయంలో .. అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. చేతి వృత్తుల వారికి వారం మధ్యలో అనుకోకుండా ఆర్డర్లు పెరుగుతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. అయితే ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
మిథునరాశి : ఈ రాశి వారికి ఈ వారంలో కెరీర్ పరంగా కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి..వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో ఉన్న ఫైనాన్స్ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మంచి పరిచయాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ధ్యానం..యోగం చేయడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు
కర్కాటకరాశి: ఈ వారం ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఇతరులతో సంభాషించే విషయంలో జాగ్రత్తలు పాటించండి. పాత మిత్రులు కలిసే అవకాశం ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగస్తులకు .. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.
సింహరాశి: ఈ రాశి వారు ఈ వారం ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా సంయమనం పాటించండి. కార్యలయంలో మీ పని మీరు చేసుకోండి. ఎవరితోనూ అనవసరంగా వాదనలు పెట్టుకోవద్దు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలైన మనశ్శాంతి ఉండే అవకాశం లేదని పండితులు చెబుతున్నారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుందిం. కంటి..పొట్టకు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు చాలా సంయమనం పాటించాలని పండితులు చెబుతున్నారు. నిత్యం సూర్యనమస్కారాలు చేయడం వలన కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది.
కన్యారాశి: ఈ రాశి వారికి ఈవారం ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుకుంటారు. జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి.
తులారాశి: ఈ రాశి వారు ఈవారం వాదోపవాదనలకు దూరంగా ఉండండి.అనుకోని ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది పడతారు. కొత్త పెట్టుబడుల విషయంలోఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగస్తులు మీరు చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి. వ్యాపారస్తులకు లాభం రాకపోయినా నష్టం ఉండదు. విద్యార్థుల విషయంలో కేరీర్ పరంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో మిశ్రమఫలితాలుంటాయి. వారం మధ్యలో నుంచి కొంత ఊరట లభిస్తుంది. స్థిర ఆస్తుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి.మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు.
వృశ్చికరాశి: ఈ వారం ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసివస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. అయితే శని.. కుజుడు ప్రభావం వలన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఓపిక.. ఓర్పు .. సహనం చాలా అవసరం. ఎట్టి పరిస్థితిలో తొందరపడవద్దు. వాహనం డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక వ్యాపారస్తుల విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి. కొత్తగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. వారం మధ్యలో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ధనుస్సురాశి: ఈ రాశి వారు ఈ వారంలో విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో కొంత ఆలస్యం జరిగినా... పట్టుదలతో పూర్తి చేస్తారు.ముఖ్యమైన కార్యాలు పూర్తి చేస్తారు. మీరు తీసుకున్న ఆలోచనలు అమలు చేస్తారు. మీ నిర్ణయాలపై కుటుంబంలో అనుకూలత. సకాలంలో రావలసిన డబ్బు సమకూరుతుంది. భూములు, వాహనాలు కొంటారు. అనుకున్న రాబడి. ఒత్తిడుల నుంచి బయటపడతారు. వ్యతిరేకులను మీవైపు ఆకట్టుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో లబ్ధి పొందుతారు. వ్యాపారులు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు
మకరరాశి: ఈ రాశి వారి ఈ వారం ఆర్థిక లావాదేవీలు మిశ్రమంగా ఉంటాయి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం అస్సలు చేయవద్దు. కష్టానికి తగ్గ ఫలితం ఆలస్యంగా అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి సలహా తీసుకోండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తంగా ఉండండి. ప్రేమ.. వివాహ ప్రయత్నాలు వాయిదా వేయండి సాగిస్తారు. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండంది. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. పెద్దల సలహాను ఆచరించేటప్పుడు అవి మీకు ఎంత వరకు ఉపయోగపడాతాయో చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
కుంభరాశి: ఈ రాశి వారికి ఈవారం అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంశలు పొందుతారు. జాబ్ మారాలనుకునే వారికి ఈవారం బాగా అనుకూలిస్తుంది. కొన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం, సమయస్ఫూర్తితో వ్యవహరించడం జరుగుతుంది. వృత్తి.. ఉద్యోగాలలో అధికారులతో సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలని పండితులు సూచిస్తున్నారు.
మీనరాశి: ఈ రాశి వారికి ఈవారంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవి ముందు మీకు అసంతృప్తి కలిగించినా.. తరువాత మంచే జరుగుతుంది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సమస్యలు వారం చివరిలో పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగినప్పటికి.. సంతృప్తికరంగానే ఉంటుంది. డబ్బు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. నిరుద్యోగులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం
