వార ఫలాలు : 20.08.2023 నుంచి 26.08.2023 వరుకు

వార ఫలాలు :   20.08.2023 నుంచి 26.08.2023 వరుకు

మేషం : రావలసిన సొమ్ము అందుతుంది. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. చిరకాల స్వప్నం ఫలిస్తుంది. వాహన, గృహ కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు.

వృషభం : స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధన లాభాలు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మనసులోని భావాలను నిర్మొహమాటంగా చెప్తారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవేత్తలు, రచయితలు, కళాకారులకు విదేశీయానం.

మిధునం : ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వచ్చే అవకాశం. ఆదాయం మెరుగుపడి ఊరట లభిస్తుంది. సన్నిహితులతో సఖ్యత. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆస్తుల వ్యవహారాల్లో గందరగోళం తొలగుతుంది. వివాహాది వేడుకల నిర్వహణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు. ఉద్యోగులకు హోదాలు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, న్యాయవాదులకు అనుకూలం.

కార్కాటకం : రాబడి ఆశాజనకం. పోటీపరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ముఖ్య కార్యాలు దిగ్విజయం. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. వ్యాపారులకు గతం కంటే మెరుగైన లాభాలు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు మంచి గుర్తింపు లభించే సమయం.

సింహం : అనుకున్న ఆదాయం. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కివస్తాయి. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కోరుకున్న హోదాలు రావచ్చు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులకు గుర్తింపు.

కన్య : పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు. ప్రముఖులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు.

తుల : పలుకుబడి, ఉన్నతస్థితి కలిగిన వారు పరిచయమవుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆప్తుల సలహాలతో  కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. శత్రువులను సైతం ఆదరిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకోని విదేశీయానం.

వృశ్చికం : చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి. స్థిరాస్తి విషయాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. రాబడి మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. రాజకీయవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది.

ధనుస్సు : ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆదాయంలో పెరుగుదల. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. నూతన ఉద్యోగాలు దక్కే అవకాశం. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం. రాజకీయవేత్తలు, కళాకారులు సత్తా చాటుకుంటారు.

మకరం : ఉద్యోగయత్నాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆశించిన ఆదాయం. కుటుంబంలో వివాహాల విషయంలో చర్చలు. ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వస్తుంది. వ్యాపారులు లాభాల దిశగా అడుగులేస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకూల సమయం.

కుంభం : దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఇతరుల సాయం లేకుండానే ముఖ్యమైన కార్యాల పూర్తి. సమాజంలో ప్రత్యేక గౌరవం. సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి వ్యవహారాల్లో కొత్త ఒప్పందాలు. వ్యాపారాల విస్తరణ. పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులకు ఆహ్వానాలు అందుతాయి.

మీనం : ఆదాయానికి ఇబ్బంది ఉండదు. సభలు, సమావేశాలకు హాజరవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. అందరిలోనూ ప్రత్యేకత నిలుపుకుంటారు. గృహం కొనుగోలు, నిర్మాణయత్నాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు లభించే వీలుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆహ్వానాలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400