వారఫలాలు : 2023 ఆగస్టు 13 నుంచి 19 వరకు

వారఫలాలు : 2023 ఆగస్టు 13 నుంచి 19 వరకు

మేషం : ఏపని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. నూతన ఉద్యోగాలు దక్కే అవకాశం. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం. రాజకీయవేత్తలు, కళాకారులు సత్తా చాటుకుంటారు.

వృషభం : ఆలోచనలకు కార్యరూపం. ఆత్మీయులతో వివాదాల పరిష్కారం. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభాలు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారులకు ఊహించని రీతిలో లాభాలు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, రచయితలు, కళాకారులకు విదేశీయానం.

మిథునం : ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వచ్చే అవకాశం. ఆదాయం మెరుగుపడి ఊరట లభిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆస్తుల వ్యవహారాలలో గందరగోళం తొలగుతుంది. వివాహాది వేడుకల నిర్వహణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులకి మెరుగైన లాభాలు. ఉద్యోగులకు హోదాలు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, న్యాయవాదులకు అనుకూలం.

కర్కాటకం : పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు. ప్రముఖులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు పూర్తి. కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు.

సింహం : పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన కార్యాలు వేగంగా పూర్తి. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆలోచనలు కలసివస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. గృహం కొనుగోలు, నిర్మాణ యత్నాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారులు ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు లభించే వీలుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆహ్వానాలు.

కన్య : అనుకున్న ఆదాయం. వివాహ, ఉద్యోగయత్నాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. మీ మాటకు ఎదురుండదు. పరిచయాలు విస్తృతమవుతాయి. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న హోదాలు రావచ్చు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది.


తుల : కుటుంబంలో శుభకార్యాలు. రాబడి ఆశాజనకం. పోటీపరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు మంచి గుర్తింపు లభించే సమయం. 

వృశ్చికం : ఉన్నతస్థితి కలిగిన వారి పరిచయం. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. శత్రువులను సైతం ఆదరిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకోని విదేశీయానం.

ధనుస్సు : సమస్యల పరిష్కారంలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. చేపట్టిన కార్యాలు పూర్తి. రాబడి మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగు లకు ఉన్నత పోస్టులు రావచ్చు. రాజకీయ వేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులకు గుర్తింపు.

మకరం : ఉద్యోగయత్నాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆశించిన ఆదాయం. కుటుంబంలో వివాహాల విషయంలో చర్చ. ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వస్తుంది. వ్యాపారులు లాభాల దిశగా అడుగులేస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకూల సమయం.

కుంభం : ఏ కార్యక్రమం చేపట్టినా సకాలంలో పూర్తి.రావలసిన సొమ్ము అందుతుంది. చిరకాల స్వప్నం ఫలిస్తుంది.  వాహన, గృహ కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. ప్రత్యర్థులు అనుకూలు రుగా మారతారు. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు.

మీనం : దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం. విద్యావకాశాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణ అనుకున్న సమయానికి పూర్తి. పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులకు ఆహ్వానాలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400